తమ కుటుంబాలలో చదువుకుంటున్న తొలి తరం వారు ఎక్కువ మంది జోగిని వ్యవస్థకు గురైన వారి పిల్లలు, రెక్కాడితేగాని డొక్కాడని కూలీల పిల్లలు. పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ఇలాంటి పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమని హరీష్ రావు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల(BAS) అంశాన్ని ఆయన తన లేఖలో చేర్చారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రవేట్ స్కూళ్లలో విద్య కోసం నిర్వహిస్తున్నారు. ఈ స్కూళ్లలో మొత్తం 25,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, ఇందులో 18,000 మంది ఎస్సీ కేటగిరీకి, 7,000 మంది ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారు. దీని పథకం కింద చదువుకుంటున్న విద్యార్థులందరూ బడుగు బలహీనవర్గాలకు చెందిన వారేనని హరీష్ రావు తెలిపారు.
ముఖ్యంగా అణచివేతకు గురైన వర్గాలకు సంబంధించిన వారు. తమ కుటుంబాలలో చదువుకుంటున్న తొలి తరం వారు ఎక్కువ మంది జోగిని వ్యవస్థకు గురైన వారి పిల్లలు, రెక్కాడితేగాని డొక్కాడని కూలీల పిల్లలు. పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ఇలాంటి పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమని హరీష్ రావు తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న రూ.80 కోట్ల BAS పథకం నిధులతో పాటు, ఈ ఏడాదికి చెందిన రూ.130 కోట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయలేదని హరీష్ రావు వెల్లడించారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.