Harish rao: ఎస్సీ వర్గీకరణ తీర్పుపై హరీష్ రావు స్పందన

ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ఉద్యమం నాటి నుంచే BRS పోరాటం చేస్తోందని ఆయన గుర్తుచేశారు. ఉద్యమ నాయకుడిగా మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారని వెల్లడించారు. 


Published Aug 01, 2024 02:25:00 AM
postImages/2024-08-01/1722497035_effr.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం అనుమతి ఇచ్చిన విషయంపై మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. 

ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ఉద్యమం నాటి నుంచే BRS పోరాటం చేస్తోందని ఆయన గుర్తుచేశారు. ఉద్యమ నాయకుడిగా మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. 

ఎస్సీ వర్గీకరణ చేయాలని 16మే, 2016 నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని స్వయంగా కలిసి లేఖ ఇచ్చారని హరీష్ రావు ఓ ఫోటో పోస్ట్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దాని ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలని హరీష్ రావు సూచించారు.

newsline-whatsapp-channel
Tags : kcr india-people ts-news news-line newslinetelugu brs harish-rao harishrao sc,stclassification y.chandrachud

Related Articles