సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మేడికుందా తండాలో 15 రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో అక్కడి గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాలి నడకన వెళ్లి కుంట నుండి బిందెలో నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారు. కలుషిత నీళ్లు తాగటం వల్ల విషజ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలవుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మేడికుందా తండాలో 15 రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో అక్కడి గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాలి నడకన వెళ్లి కుంట నుండి బిందెలో నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారు. కలుషిత నీళ్లు తాగటం వల్ల విషజ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలవుతున్నారు.
మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని అధికారులను వేడుకున్నా స్పందించడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన హరీష్ రావు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించాలని ఆయన సూచించారు. వెంటనే చర్యలు తీసుకొని తండా వాసులకు మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా చూడాలని ఆయన సూచించారు.