మనం తీక్షణంగా గమనిస్తే మనం నిత్యం ఎదుర్కునే ఎన్నో ఇబ్బందులకు, ఆరోగ్య సమస్యలకు ప్రకృతిలోనే సమాధానం ఉంది.
Published Aug 29, 2024 03:57:49 PM
న్యూస్ లైన్ హెల్త్ డెస్క్ : మనం తీక్షణంగా గమనిస్తే మనం నిత్యం ఎదుర్కునే ఎన్నో ఇబ్బందులకు, ఆరోగ్య సమస్యలకు ప్రకృతిలోనే సమాధానం ఉంది. ఈ భూమ్మీద ఉన్న ప్రతి చెట్టు, ప్రతి ఆకు, ప్రతి పువ్వు ఔషధమయమే. ప్రకృతి నుంచి మనుషులకు అందిన కొన్ని అద్భుతాల్లో మందార పువ్వు ఒకటి. మందారపువ్వు వల్ల చాలా రకాల ఉపయోగాలున్నాయి. అయితే.. రోజూ ఉదయాన్నే పరిగడుపున ఒక మందార పువ్వు తింటే ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఓ లుక్కేద్దామా..
- ఉదయాన్నే పరిగడుపున మందార పువ్వును తీసుకుంటే బరువు తగ్గుతారు.
- మందారపువ్వులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి.
- మందారలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
- మందార పువ్వుతో చేసిన టీ ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొందరగా విసర్జించబడుతాయి.
- రక్తహీనతతో ఇబ్బంది పడేవారికి మందార మంచి పరిష్కారం. ప్రతిరోజు ఉదయాన్నే ఒక మందార పువ్వు గానీ, మందార జ్యూస్ గానీ తాగితే రక్తం వృద్ధి చెందుతుంది.
- మందారలో యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. తలకు పెట్టుకునే నూనెలో మందార ఆకులు, పువ్వు వేసి పెట్టుకుంటే తెల్ల వెంట్రుకలు తొందరగా రావు. జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
- మందార టీ రెగ్యులర్ గా తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.
- జలుబు అరికట్టడంలో మందార పువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి.
Tags : viral-news health-news health health-benifits latest-news hibiscus-tea