దీనిపై మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావులపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ తరఫు లాయర్లు కోర్టును కోరారు.
న్యూస్ లైన్ డెస్క్: ఎమ్మెల్యేల అనర్హత అంశంలో దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ వాయిదా పడింది. బీఆర్ఎస్ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావులపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ తరఫు లాయర్లు కోర్టును కోరారు.
స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానానికి తెలిపారు. దీనికి సంబంధించిన అంశంపైనే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను కూడా న్యాయస్థానానికి వెల్లడించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 1కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.