రాష్ట్రంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో సైతం భారీ వర్షపాతం నమోదైంది. ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో సైతం భారీ వర్షపాతం నమోదైంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
నాగర్ కర్నూల్, నారాయణపేట్, సిద్ధిపేట, వనపర్తి, జనగామ, గద్వాల, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నేడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో విద్యాశాఖ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.