ఏ పాత్ర అయినా సరే ఇట్టే నటించగలిగే హీరో.. అలాంటి నాని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేముందు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారట.
న్యూస్ లైన్ డెస్క్: హీరో నాని ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అష్ట కష్టాలు పడి స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి నాని తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న మూవీ అష్టాచమ్మా. తర్వాత ఆయన వరుస సినిమాల్లో నటిస్తూ నాచురల్ స్టార్ నానిగా పేరు పొందారు. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న నాని నటన చాలా డిఫరెంట్. ఆయన సినిమా కథలు కూడా చాలా డిఫరెంట్ గా ఎంచుకుంటూ నటిస్తూ ఉంటారు. కామెడి పాత్రలు కానీ, లవ్ సినిమాస్, యాక్షన్ పాత్రలో కానీ, ఇలా ఏ పాత్ర అయినా సరే ఇట్టే నటించగలిగే హీరో..
అలాంటి నాని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేముందు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారట. ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోకి రాకముందు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఏం చేయాలనుకున్నాడు అనే విషయాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఆ వివరాలు ఏంటో చూసేద్దామా.. నాని ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా స్థిరపడ్డారట. ఆ ఆ టైంలో నానికి మొదటి జీతం నాలుగు వేలు ఇచ్చారట. అయితే ఫస్ట్ శాలరీ అందుకున్న సమయంలో నాని ఆనందానికి అవధులు లేవని చెప్పుకొచ్చారు.
ఆయనకిచ్చినవన్నీ 100 నోట్ల రూపాయలే. వాటిని జేబులో పెట్టుకొని తను ఉండే రూమ్ కి వెళ్తున్న టైంలో ఆయన ఫీలింగ్ ఇలా ఉందట. ఈ డబ్బుతో సగం హైదరాబాదును కొనేయాలనుకున్నానని, ఆ టైంలో నాకు అలాంటి భావన కలిగిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు నేను కోట్ల రూపాయలు సంపాదించినా కానీ, నా మొదటి జీతం 4000 వచ్చినప్పుడు పొందిన అనుభూతి పొందలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.
ఆ టైంలో నేను నా స్నేహితులతో గడిపేందుకు వీకెండ్ ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూసే వాడినని అన్నారు. ప్రస్తుతం నాని "సరిపోదా శనివారం" అనే చిత్రం చేస్తున్నారు. ఈమూవీ వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఈ మూవీ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.