Honey Rose:నా 20ఏళ్ల కోరిక వారి ద్వారా తీర్చుకుంటాను..!

ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు ఇతర నటినటులు  కాస్త సంపాదించిన తర్వాత ఇతర బిజినెస్ లు కూడా పెట్టుకుంటున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు అలుక్కోవాలి అనే సామెతకు నిలువెత్తు


Published Sep 07, 2024 03:38:50 PM
postImages/2024-09-07/1725703730_honeyrose1.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు ఇతర నటినటులు  కాస్త సంపాదించిన తర్వాత ఇతర బిజినెస్ లు కూడా పెట్టుకుంటున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు అలుక్కోవాలి అనే సామెతకు నిలువెత్తు నిదర్శనంగా మారుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉండేటువంటి చాలామంది స్టార్లు ఫుడ్ బిజినెస్ లు, ఇతర బిజినెస్ లలోకి అడుగుపెట్టి రాణిస్తున్నారు. ఆ విధంగానే  ఈ స్టార్ హీరోయిన్ హనీ రోజ్ కూడా  కొత్త వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. మరి ఆమె ఏం చేసింది ఆ వివరాలు ఏంటో చూద్దాం.

హనీరోజ్  బాలకృష్ణ చేసిన వీరసింహారెడ్డి చిత్రం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె మిగతా ఏ చిత్రాల్లో కూడా అంతగా ఆకట్టుకోలేక పోయినా కానీ సోషల్ మీడియాలో ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే ఉంది. అలాంటి హనీరోజ్ త్వరలో ప్రొడ్యూసర్ గా మారనుందని తెలుస్తోంది.  అంతేకాదు ఆమె "హనీరోజ్ వర్గీస్ ప్రొడక్షన్" పేరుతో ఒక నిర్మాణ సంస్థను కూడా స్టార్ట్ చేసింది. అయితే ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టేసింది.

ప్రొడ్యూస్ చేసే సంస్థకు సంబంధించినటువంటి లోగోను రిలీజ్ చేసింది. సినిమా అనేది ప్రతి ఒక్కరికి కళ. కొంతమంది టాలెంట్ ఉన్నా కానీ ఆదరించే వారు లేక వెనకబడి పోతున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించి సినిమా రంగంలోకి ఆహ్వానించాలనేదే నా కోరిక. అలాంటి వారితో నేను పని చేయాలన్నది నా లక్ష్యం అంటూ చెప్పుకొచ్చింది. గత రెండు దశాబ్దాల నుంచి నేను సినిమా ఇండస్ట్రీలో భాగమయ్యాను.

పరిశ్రమలో పెద్ద పెద్ద పాత్రలు పోషించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. నా బర్త్ డే సందర్భంగా నేను ఈ వెంచర్ లోగోను  రిలీజ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ ప్రొడక్షన్ నుంచి వచ్చే చిత్రాలు, ఏవైనా సరే ఇండస్ట్రీ కీర్తిని కాపాడేలా ఉంటాయని చెప్పుకొచ్చింది హనీరోజ్. ప్రస్తుతం ఆమె ఆవిష్కరించిన లోగో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : news-line balakrishna veerasimhareddy honey-rose honey-roose-vargis-prodection

Related Articles