పలు డిపోలకు సంబంధించిన మేనేజర్లు కెలెక్షన్లు ఎక్కువ తీసుకొని రావాలని కండక్టర్లను ఒత్తిడికి గురిచేస్తున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. కానీ, బయటకు వచ్చిన తరువాత ఆ విషయాన్ని చెప్పాలంటే ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అనే భయంతో కండక్టర్లు, డ్రైవర్లు బస్సు ఎక్కే ప్రయాణికులపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఆడవారి ఉచిత బస్సు ప్రయాణాలకు అయ్యాయి ఖర్చును భరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ఆడవానికి బస్సు డ్రైవర్లు, కండక్టర్లు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. డబ్బు ఇవ్వకుండా కేవలం ఆధార్ చూపించి ప్రయాణం చేస్తారంటూ ఆడవారిని చూస్తే కొంతమంది డ్రైవర్లు బస్సు కూడా ఆపకుండా వెళ్లిపోయిన ఘటనలు ఇప్పటికీ చాలానే జరిగాయి. దీంతో ఆడవారికి సరైన గౌరవం ఇవ్వని ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంట అంటూ మహిళలు ఎద్దేవా చేస్తున్నారు.
అయితే, పలు డిపోలకు సంబంధించిన మేనేజర్లు కెలెక్షన్లు ఎక్కువ తీసుకొని రావాలని కండక్టర్లను ఒత్తిడికి గురిచేస్తున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. కానీ, బయటకు వచ్చిన తరువాత ఆ విషయాన్ని చెప్పాలంటే ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అనే భయంతో కండక్టర్లు, డ్రైవర్లు బస్సు ఎక్కే ప్రయాణికులపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు, జర్నలిస్ట్ కార్డులు ఉన్నవారిని బస్సులోకి అనుమతించడం లేదు. అయితే, ఓ రిపోర్టర్ అంత్యక్రియాలకు వెళ్తున్న జర్నలిస్టులకు కూడా ఆర్టీసీ బస్సులో ఈ రకంగానే అవమానం జరిగింది.
యోగి చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళ్తున్న జర్నలిస్టులను దిగిపోమంటూ జనగామ డిపో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ వార్నింగ్ ఇచ్చారని వారు వాపోయారు. ఒక బస్సులో నలుగురు జర్నలిస్టులు ఎక్కగా.. ఇంకా ఎంత మంది వస్తారంటూ డ్రైవర్లు, కండక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరేయ్ వీడి పాస్ గుంజుకొని డిపోలో అప్పచెప్పు అక్కడ మాట్లాడదాం అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు జర్నలిస్టులు తెలిపారు. జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన జనగామ డిపో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్ చేస్తున్నాయి.
బస్ పాస్‌లపై ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ అహంకారానికి పరాకాష్ట.
హనుమకొండలో ఒక జర్నలిస్టు సోదరుడు యోగి చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళ్తున్న జర్నలిస్టులను దిగిపోమంటూ వార్నింగ్ ఇచ్చిన కండక్టర్. pic.twitter.com/ry1mo2tSTo — News Line Telugu (@NewsLineTelugu) August 11, 2024