నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఉన్న సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనంలోకి వరద చేరింది. సెల్లార్ ప్రాంతంలో ఒక్కసారిగా 10-12 అడుగుల ఎత్తులో వరద నీరు రావడంతో ముగ్గురు UPSC విద్యార్థులు మృతి చెందారు. మృతుల్లో యూపీకి చెందిన శ్రేయా యాదవ్, కేరళకు చెందిన నవీన్ దల్విన్ ఉన్నారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాతప్రమాదం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)కి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత సంఘటన స్థలంలో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(MCD)కి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనకు దిగారు. డ్రైనేజీని క్లియర్ చేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఢిల్లీ ఘటనలో మృచెందిన వారిలో తెలంగాణకు చెందిన యువతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మంచిర్యాలకు చెందిన విద్యార్థిని తన్య సోని ఈ ప్రమాదంలో మృతిచెందింది. ఆమె తండ్రి విజయ్ కుమార్ శ్రీరామ్‌పూర్-1 భూగర్భ గని మేనేజర్‌గా చేస్తున్నట్లు తెలుస్తోంది. సివిల్స్ కోచింగ్ కోసం సోని ఢిల్లీకి వెళ్లిందని ఆయన తెలిపారు.