ప్రస్తుత కాలంలో చాలామందికి ఏజ్ తో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది. దీనికి ప్రధాన కారణం మనం తినే ఫుడ్ పెరిగే వాతావరణం అని చెప్పవచ్చు. మనం తినే ఫుడ్ వల్ల చాలా వరకు కొలెస్ట్రాల్
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామందికి ఏజ్ తో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది. దీనికి ప్రధాన కారణం మనం తినే ఫుడ్ పెరిగే వాతావరణం అని చెప్పవచ్చు. మనం తినే ఫుడ్ వల్ల చాలా వరకు కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటుకు దారితీస్తుంది. అలాంటి కొలెస్ట్రాలను మనం కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఇలా చేయాల్సిందే. ఇలా చేస్తే కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుందట.. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఓట్స్ వంటివి పొద్దున్నే తింటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుందట.
అంతేకాకుండా ఉదయం లేవగానే పరిగడుపున గ్రీన్ టీ తాగడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయట. అంతేకాకుండా ఉదయం పూట వాకింగ్, జాగింగ్ చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందట. దానిమ్మ పండు ఆపిల్ బెర్రీలు ఎక్కువగా తినడం వల్ల మంచి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుందట.
దీనివల్ల గుండె బలంగా తయారవుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పరిగడుపున నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందని అంటున్నారు. వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడినా కానీ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుందని అంటున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఉదయం లేవగానే సూర్య నమస్కారం ఫోజులో ఎక్సర్సైజ్ చేస్తే కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.