దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులకు మండపాలు అన్ని సిద్ధమైపోయాయి. ఎక్కువగా గణపతిని మండపాల్లో పెట్టి మాత్రమే పూజిస్తారు. ఎంతో మంది ఈ నవరాత్రుల్లో ఇండ్లలో కూడా వినాయకుని పెట్టుకొని
న్యూస్ లైన్ డెస్క్: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులకు మండపాలు అన్ని సిద్ధమైపోయాయి. ఎక్కువగా గణపతిని మండపాల్లో పెట్టి మాత్రమే పూజిస్తారు. ఎంతో మంది ఈ నవరాత్రుల్లో ఇండ్లలో కూడా వినాయకుని పెట్టుకొని పూజలు చేస్తారు. అలాంటి గణపతి పూజ ఎలా చేస్తే మనం కోరిన తప్పక నెరవేరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖ్యంగా మీ ఇంట్లో పూజా మందిరంలో గరిక తెచ్చుకొని దాన్ని కింద పరవాలి. దానిపై మామిడాకు లేదంటే జిల్లెడ లేదంటే తమలపాకు పెట్టండి. దీనిపై కాస్త ఆవు పేడ పెట్టి దానిపై గణపతి విగ్రహాన్ని పెట్టండి. ఆ విగ్రహానికి జిల్లేడు పూలతో పూజ చేస్తూ, "వక్రతుండాయ హుమ్" అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదవండి. మట్టితో తయారు చేసే గణపతికి కాస్త ఆవు పేడ కలిపి చేసిన గణపతిని పూజిస్తే అన్ని నెరవేరుతాయట.
ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత మరునాడు ఆవు పేడ, ఆకు, గరికనంత తీసివేసి ఏదైనా మనుషులు తొక్కని ప్లేస్ లో వేయాలి. దీన్నే సిప్రా సంకట గణపతి పూజ అంటారు. ఈ పూజ సమయంలో మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో ఆ కోరిక వారం రోజుల్లో తప్పనిసరిగా నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ పూజలో ఒక ఐదు పుష్పాలు ఉపయోగిస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది.
కలువ పువ్వు, తామర పువ్వు, మందార పువ్వు, జిల్లేడు పువ్వు, సంపంగి పువ్వులతో, తిరుగులేని రాజయోగం పడుతుంది అంతేకాకుండా మీ పిల్లలు మొండి చేసే వారైతే అది కూడా తగ్గిపోతుంది. ఈ పూజ సమయంలో అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి.