కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. కాలం గడుస్తున్న ఇంతవరకు వేతనాల పెంపు ప్రస్తావనే లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని అసెంబ్లీ వద్ద ప్రభుత్వ ప్రతిపక్ష నేతలకు విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాలు సమర్పించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు IFTU నేత షేక్ యాకుబ్ షా వలి వినతి పత్రం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. కాలం గడుస్తున్న ఇంతవరకు వేతనాల పెంపు ప్రస్తావనే లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
కోల్ ఇండియాలో అమలవుతున్న వేతనాలు అమలు చేయకుండా, చట్టబద్ధ హక్కులు ఏవి కూడా అమలు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2017 నుంచి కనీస వేతనాలను సవరించకుండా ప్రభుత్వాలు యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో అత్యంత దురదల జీవితాలు గడుపుతున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు తక్షణం వేతనాల పెంపు తప్పనిసరి. వేతనాల పెంపుకై ప్రభుత్వ ప్రతిపక్ష నేతలు అసెంబ్లీలో చర్చించాలని కోరారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛలో ఢిల్లీకి పిలుపునిస్తామని అన్నారు.