Delhi: కవిత ఆరోగ్యంపై కోర్టు కీలక ఆదేశాలు

తనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కవిత కోర్టు దృష్టికి తీసుకొని వెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించినప్పటికీ రిపోర్టులలో వ్యత్యాసం కనిపిస్తోందని ఆమె వెల్లడించారు. ఇప్పటికే ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్ లో క్లినికల్ టెస్ట్ చేయించుకునేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు న్యాయస్థానానికి కవిత తరఫు లాయర్లు ప్రైవేట్ ఆస్పత్రిలో చెకప్ కోసం దరఖాస్తు సమర్పించారు. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-18/1721302476_modi20240718T170210.427.jpg

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం పట్ల అధికారులకు ఢిల్లీ  రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఆమె తీహార్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే, రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కవితను ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి అధికారులు చికిత్స అందించారు. 

అయితే, కవిత సీబీఐ జ్యూడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది.  ఈ నేపథ్యంలోనే ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపర్చారు. విచారణ అనంతరం కవిత జ్యూడిషియల్ కస్టడీని ఈ నెల 22 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా, తనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కవిత కోర్టు దృష్టికి తీసుకొని వెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించినప్పటికీ రిపోర్టులలో వ్యత్యాసం కనిపిస్తోందని ఆమె వెల్లడించారు. ఇప్పటికే ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్ లో క్లినికల్ టెస్ట్ చేయించుకునేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు న్యాయస్థానానికి కవిత తరఫు లాయర్లు ప్రైవేట్ ఆస్పత్రిలో చెకప్ కోసం దరఖాస్తు సమర్పించారు. దీంతో న్యాయస్థానం ఎయిమ్స్ హాస్పిటల్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.  
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam delhi liquor-policy-case mlc-kavitha delhi-liquor-policy-case

Related Articles