జిల్లాలో వరదలు ధాటికి వెయ్యి మందికి జ్వరాలు వచ్చినట్లు గుర్తించామని డాక్టర్లు వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: ఖమ్మం జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. మున్నేరు ముంపు ప్రాంతంలో ఆరోగ్య సర్వే కొనసాగుతోంది. మొత్తం 860 ప్రత్యేక డాక్టర్ల బృందాలతో ఆరోగ్య సర్వే జరిపిస్తన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 వేల మందికి ఆరోగ్య సర్వే నిర్వహించారు. జిల్లాలో వరదలు ధాటికి వెయ్యి మందికి జ్వరాలు వచ్చినట్లు గుర్తించామని డాక్టర్లు వెల్లడించారు.
ఖమ్మం నగరంలో వంద డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాగా, నేటి నుంచి వరద బాధితులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందనుంది. జిల్లాలో తక్షణ సాయం కోసం 22 వేల కుటుంబాలను గుర్తించామని అధికారులు తెలిపారు.