డ్యూటీలో ఉన్న ట్రాక్ మన్ రైలు పట్టాలు వేలాడుతున్న విషయాన్ని గుర్తించి అధికారులను అప్రమత్తం చేశారు. ట్రాక్ తెగిపోవడంతో నీరు దాని నుండే ప్రవహిస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: మహబూబాబాద్ వద్ద వరదల కారణంగా రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కేసముద్రం, ఇంటకన్నెలను కలిపే రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. డ్యూటీలో ఉన్న ట్రాక్ మ్యాన్ రైలు పట్టాలు వేలాడుతున్న విషయాన్ని గుర్తించి అధికారులను అప్రమత్తం చేశారు. ట్రాక్ తెగిపోవడంతో నీరు దాని నుండే ప్రవహిస్తోంది.
దాదాపు 12 గంటల పాటు వరద పోటెత్తడంతో పట్టాల కింద ఉన్న కట్ట 50 మీటర్ల మేర కొట్టుకుపోయిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రెండు రోజులుగా ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను ఆపేశారు. దీంతో తాళ్ల పూస పల్లి శివారులో రైల్వే అధికారులు మరమ్మత్తులు ప్రారంభించారు. మొత్తం 8 జేసీబీలను తెప్పించి మరమ్మత్తులు చేయిస్తున్నారు.
మరో 24 గంటల సమయంలోపు మరమ్మత్తులు చేసి పునరుద్ధరణ చేస్తామని అధికారులు వెల్లడించారు. వరద ఉద్ధృతి తగ్గినా నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. రైల్వే కల్వర్టు చిన్నగా ఉండడంతో వరద ఉద్ధృతిని తట్టుకోలేకపోయిందని అన్నారు.