Olympics : భారత షూటర్ మను భాకర్ గురించి ఎవరికీ తెలియని విషయాలివే..

పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన మను భాకర్ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు మీకోసం..


Published Jul 28, 2024 09:31:56 AM
postImages/2024-07-28/1722176791_IMG20240728194552640x400pixel.jpg

న్యూస్ లైన్ డెస్క్ 

పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల మహిళా ఎయిర్ పిస్టల్ పోటీల్లో ఆమె ఈ ఒలింపిక్స్ లో దేశానికి తొలి పతకం సాధించింది. ఫైనల్లో మను 221.7 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. దీంతో ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సాధించింది. ప్రస్తుతం దేశమంతా మాట్లాడుకుంటున్న మను భాకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం.. 

ఖాందాన్ అంతా..

మను భాకర్ హర్యానాలోని ఫిబ్రవరి 18, 2002న ఓ గజ్జర్ కుటుంబంలో జన్మించింది. బాక్సర్లు, రెజ్లర్లకు పేరుగాంచిన గజ్జర్‌ వంశంలో మను పుట్టింది. చదువుకునే రోజుల్లోనే టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ లాంటి క్రీడల్లో చురుగ్గా ఉండేది. ఫైనల్ గా షూటింగ్‌ ఎంచుకొని దాని మీద దృష్టి పెట్టింది. 14 ఏళ్ల వయసులో ఒక స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్‌ కొనివ్వమని ఆమె తండ్రిని కోరింది. ఆమె అడగగానే తండ్రి రామ్ కిషన్ భాకర్ ఆమెకు స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్‌ని కొనిచ్చారు. అక్కడినుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈరోజు ప్రపంచ యవనికపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసింది.

బంగారం లాంటి షూటర్..

ఇంటర్నేషనల్ గేమ్స్ లోకి మను భాకర్ 2017లో అరంగేట్రం చేసింది. 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపియన్, వరల్డ్ మాజీ నెంబర్ వన్ షూటర్ హీనా సిద్ధూను ఓడించి అందరి మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత 2018లో బ్యూనస్ ఎయిర్స్‌ లో జరిగిన యూత్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో గోల్డ్ మెడల్ కొట్టింది. అప్పుడు మను భాకర్ వయసు.. 16 ఏళ్లే. ఆ తర్వాత 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ మను గోల్డ్ మెడల్ సాధించి నెంబర్ వన్ షూటర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. పదిలం చేసుకుంది. జకార్తాలో జరిగిన 2018 ఆసియా క్రీడల్లో భారత షూటర్ అభిషేక్ వర్మతో కలిసి మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మరో గోల్డ్ మెడల్ సాధించింది. 

గత ఒలింపిక్స్ లో చేదు జ్ఞాపకం..

ఎన్నో ఆశలతో షూటింగ్ కెరీర్‌ ప్రారంభించిన మనుకి టోక్యో ఒలింపిక్స్ తీవ్ర శోకాన్ని మిగిల్చాయి. ఎన్నో అంచనాలు, ఆశలు, ఆశయాలతో టోక్యోకు వెళ్లిన ఆమెకు కీలక సమయంలో గన్‌లో సాంకేతిక లోపం వల్ల పతకం లేకుండా తిరిగి రావడం తీవ్ర నిరాశను కలిగించింది. వుమెన్స్ 10మీ. ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో గన్‌లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఒత్తిడికి పెరిగి విలువైన సమయాన్ని కోల్పోయింది. ఫలితంగా ఫైనల్‌కు దూరమయ్యింది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో గురి తప్పకుండా తూటా పేల్చి.. పతకాన్ని సాధించింది. ఈ ఒలంపిక్స్‌లో మను విజయం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది షూటర్లకు రోల్ మోడల్‌గా నిలిపింది. ప్రపంచంలో మను భాకర్ ను అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : national paris-olympic parisolympics olympic2024-

Related Articles