దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు లాయర్‌కు కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వరాల తరువాతః కొనసాగించనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
న్యూస్ లైన్ డెస్క్: అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రతిపక్ష నేతగా తనను గుర్తించాలని రిప్రజెంటేషన్ ఇవ్వాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. గత నెల 24న రిప్రజెంటేషన్ ఇచ్చారని జగన్ తరఫు లాయర్ తెలిపారు.
వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని ఇటీవల స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి జగన్ లేఖ రాశారు. కానీ, స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గత వారం జగన్ ఏపీ హైకోర్టుకు వెళ్లారు. అయినప్పటికీ స్పీకర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో అసెంబ్లీ సెక్రటరీతో పాటు స్పీకర్ కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు లాయర్‌కు కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వరాల తరువాతః కొనసాగించనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.