వీధుల్లో పిచ్చి కుక్కలు ప్రజల్ని కరుస్తున్నాయి. కనకపు సింహాసనం మీద కూర్చున్న వాళ్లని ఏమైనా అడిగితే ప్రతిపక్షాలను కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వత వింత పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వీధుల్లో పిచ్చి కుక్కలు ప్రజల్ని కరుస్తున్నాయి. కనకపు సింహాసనం మీద కూర్చున్న వాళ్లని ఏమైనా అడిగితే ప్రతిపక్షాలను కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.
గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే బలహీనమైన ప్రభుత్వం అనుకున్నామని ఆయన అన్నారు. కానీ, ప్రస్తుతం అంతకు మించిన బాధ్యతరహిత్యమైన ప్రభుత్వం వచ్చిందని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ఉన్న మాట అంటే కాంగ్రెస్ మంత్రులకు ఉలుకెందుకు? అని ఆయన ప్రశ్నించారు. కంటతడి పెట్టుకున్న మంత్రిని చూస్తే ఆశ్చర్యం వేసిందని ఆయన అన్నారు. హరీష్ రావు మాట్లాడిందాంట్లో అన్‌పార్లమెంటరీ ఏముంది? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. కనీసం బటన్ నొక్కే సమయంలో అయినా కేసీఆర్ కష్టం గురించి చెప్పండని మంత్రులను కోరుతున్నానని జగదీష్ రెడ్డి అన్నారు.
రైతు రుణమాఫీకి రూ.12 వేల కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఉత్తమ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు.. కనీసం అధికారులతో ఆయన మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి 2022 దాకా వరసగా కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే ఈ అనుమతులు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీతారామ ప్రాజెక్టుపై కనీసం ఒక ఉత్తరమైనా రాశారా? అన్నారు.