పెట్రోల్ బంకులో దొంగతనం చేసిన కేసు కూడా జగదీష్ రెడ్డిపై ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా, కర్ణాటక నుండి అక్రమంగా మద్యాన్ని రవాణా చేసిన కేసు మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌లో ఉందని ఆయనపై అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపిస్తే అసెంబ్లీ సాక్షిగా ముక్కు నెలకు రాస్తానని అసెంబ్లీ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో జగదీష్ రెడ్డి ఆయనపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
మదన్ మోహన్ రెడ్డి అనే నాయకుడి హత్య కేసులో జగదీష్ రెడ్డి నిందితుడిగా ఉన్నారని ఆయన ఆరోపించారు. భిక్షం అనే వ్యక్తి మర్డర్ కేసులో కూడా జగదీష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి A6, A7గా ఉన్నారని అన్నారు. అంతేకాకుండా, రాంరెడ్డి హత్య కేసులో A3గా ఉన్నారని ఆరోపించారు. పెట్రోల్ బంకులో దొంగతనం చేసిన కేసు కూడా జగదీష్ రెడ్డిపై ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా, కర్ణాటక నుండి అక్రమంగా మద్యాన్ని రవాణా చేసిన కేసు మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌లో ఉందని ఆయనపై అన్నారు.
వెంకట్ రెడ్డి ఆరోపణలపై స్పందించిన జగదీష్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. వెంకట్ రెడ్డి ఆరోపణలను నిజమని నిరూపిస్తే అసెంబ్లీ సాక్షిగా ముక్కు నెలకు రాస్తానని ఆయన అన్నారు. రాజకీయాలకు రాజీనామా చేస్తానని మళ్లీ పాలిటిక్స్‌లోకి రానని ఆయన అన్నారు. నిరూపించకుంటే రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఇద్దరు ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలను రికార్డుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
సవాల్ స్వీకరిస్తున్నా..
వెంకట్ రెడ్డి ఆరోపణలను నిరూపించకుంటే రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఇద్దరు ముక్కు నేలకు రాయాలని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే, ఆ సవాల్‌ను స్వీకరిస్తున్నానని వెంకట్ రెడ్డి తెలిపారు. జగదీశ్‌రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడని, దొంగతనం కేసులోనూ జగదీశ్‌రెడ్డి నిందితుడని ఆయన మరోసారి ఆరోపించారు. మదన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో జగదీశ్‌రెడ్డి హస్తం ఉందని ఆయన అన్నారు. జగదీశ్‌రెడ్డిని ఏడాదిపాటు జిల్లా నుంచి బహిష్కరించారని తెలిపారు. ఇక, ఆయన చేసిన ఆరోపణలు నిజమేనా..ఒకవేళ నిజమైతే నిరూపించగలరా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.