Jagadish reddy: కాంగ్రెస్‌తో కలిసి పోలీసులు పని చేస్తున్నారా?

 హామీల అమలు విఫలం కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసాలు బయటపడకుండా ఉండేందుకు హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన అన్నారు. పోలీసుల సమక్షంలోనే శిబిరాన్ని కూల్చివేశారని తెలిపారు. 


Published Aug 22, 2024 05:36:59 PM
postImages/2024-08-22/1724328419_guntakandla3.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి పోలీసులు పని చేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రుణమాఫీ ఆందోళన, తిరుమలగిరి దాడి ఘటనలపై స్పందించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తిరుమలగిరి BRS శిబిరంపై కాంగ్రెస్ దాడిని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్టన్‌లోనే BRSపై దాడులు జరుగుతున్నాయముని ఆయన అన్నారు. 

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. హామీల అమలు విఫలం కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసాలు బయటపడకుండా ఉండేందుకు హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన అన్నారు. పోలీసుల సమక్షంలోనే శిబిరాన్ని కూల్చివేశారని తెలిపారు. 

రుణమాఫీ పై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన లేదని అన్నారు. చెయ్యని రుణమాఫీకి కాంగ్రెస్ ప్రచారాలతో డంబాచారాలకు పోతోందని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై రైతులు స్వచ్ఛందంగా ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. స్వయానా మంత్రులే పూర్తిస్థాయిలో మాఫీ కాలేదని చెబుతున్నా ప్రభుత్వం కవరింగ్ చేస్తోందని ఆయన అన్నారు. దాడులు చేసి రెచ్చగట్టాలని చూస్తున్నారని అన్నారు.

రైతాంగానికి న్యాయం జరిగే వరకు ఎన్ని దాడులు చేసినా మా పోరాటం ఆగదని అన్నారు. హామీ అమలు మరిస్తే ప్రజలు కాంగ్రెస్‌ని వదిలిపెట్టరని ఆయన అన్నారు. ప్రతిపక్షంగా ప్రజలకిచ్చిన హామీల కోసం ప్రభుత్వంపై ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : kcr ts-news news-line newslinetelugu brs telanganam jagadish-reddy thungathurthy

Related Articles