రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ చేయకండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మీ శక్తిని ఉపయోంచాలని పోలీసులకు సూచించారు. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ చేయకండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మీ శక్తిని ఉపయోగించండి అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్లకండువాలు, బ్యాడ్జీలతో వెళ్లారు. అసెంబ్లీ గేట్ వద్దనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్లకండువాలు వేసుకొని అసెంబ్లీలో లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ చేయకండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మీ శక్తిని ఉపయోంచాలని పోలీసులకు సూచించారు. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ చేయకండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మీ శక్తిని ఉపయోగించండి అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ జగన్, వైసీపీ నేతలు అసమ్మతి వ్యక్తం చేశారు.