ఏపీలో దాడులకు సంబంధించిన వీడియోలను జగన్ అఖిలేష్ యాదవ్‌కు చూపించారు. జగన్ డిల్లీకి రాకపోతే తనకు నిజాలు తెలిసి ఉండేవి కావని అఖిలేష్ యాదవ్ అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలోని ధర్నా చేసిన వైసీపీకి 8న రాజకీయ పార్టీల మద్దతు లభించింది. ఏపీలో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నవిషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యం అంటే న్యాయంగా ఉండాలి, న్యాయం గెలవాలని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ చేతిలో రెడ్ బుక్ పట్టుకుని ఉన్న ఫోటోతో హోర్డింగ్స్ పెట్టారు. 45 రోజుల్లోనే 30 మందికి పైగా హత్యలు జరగడం రాష్ట్ర దౌర్భాగ్యమని అన్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ ధర్నాకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంఘీభావం ప్రకటించారు. ఏపీలో దాడులను నిరసిస్తూ చేసిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఏపీలో దాడులకు సంబంధించిన వీడియోలను జగన్ అఖిలేష్ యాదవ్‌కు చూపించారు. జగన్ డిల్లీకి రాకపోతే తనకు నిజాలు తెలిసి ఉండేవి కావని అఖిలేష్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్న వారికి ఓపిక ఉండాలని ఆయన అన్నారు.ఉత్తరప్రదేశ్‌లో బూటకపు ఎన్ కౌంటర్లను కూడా చూశామని ఆయన గుర్తుచేసుకున్నారు.
కాగా, వైసీపీ నిరసనకు 8 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. సమాజ్‌వాదీ, ఐయూఎంఎల్, అన్నాడీఎంకే, శివసేన, టీఎంసీ, జార్ఖండ్ ముక్తిమోర్చా, వీసీకే, ఆప్ పార్టీలు మద్దతు తెలిపాయి. శాంతిభద్రతలను రక్షించేందుకు తోడుగా ఉండనున్నట్లు హామీ ఇచ్చాయి.