పవర్ కట్స్ గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ రుణమాఫీ మోసంపై శాంతియుతంగా నిరసన తెలిపితే.. పోలీసుల సమక్షంలో దాడులు చేశారని మండిపడ్డారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది.. అందులో పోలీస్ వ్యవస్థ కూడా భాగం అవ్వడం దురదృష్టకరమని మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం డీజీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. పవర్ కట్స్ గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ రుణమాఫీ మోసంపై శాంతియుతంగా నిరసన తెలిపితే.. పోలీసుల సమక్షంలో దాడులు చేశారని మండిపడ్డారు.
మహిళా జర్నలిస్టుల మీద సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో ఆయన అనుచరులు దాడి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని జగదీష్ రెడ్డి అన్నారు.