తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారంచేశారు. తెలంగాణకు గవర్నర్ గా నియామకమై ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చిన జిష్ణు దేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.
న్యూస్ లైన్ డెస్క్ : తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారంచేశారు. తెలంగాణకు గవర్నర్ గా నియామకమై ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చిన జిష్ణు దేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్రావు ఇతర ఉన్నతాధికారులు సీఎంతో పాటు ఉన్నారు.
కాగా.. కేంద్రం ఇటీవల దేశంలోని 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. వీరిలో ఏడుగురికి కొత్తగా నియమించింది. మరో ముగ్గురిని ఒక చోట నుంచి మరోచోటికి బదిలీ చేసింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. 1957 ఆగష్టు 15న జిష్ణు దేవ్ వర్మ త్రిపురలో ఓ రాజ కుటుంబంలో జన్మించారు. త్రిపుర డిప్యూటీ సీఎంగా, భారత బ్యాడ్మింటన్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. జిష్ణుదేవ్ ని తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించడం పట్ల బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్ గా.. త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ ని తెలంగాణకు గవర్నర్ గా నియమించడం తెలంగాణలో బీజేపీని విస్తరించేందుకే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.