KTR: పిల్లులు, ఎలుకల పాలైన జేఎన్టీయూ

విద్యార్థులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోజనంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని, అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక ఈ విషయాన్ని మరువక ముందే, అదే హాస్టల్‌లో విద్యార్థుల ఆహారాన్ని పిల్లి తింటూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
 


Published Jul 16, 2024 02:01:10 AM
postImages/2024-07-16/1721105483_modi20240716T101836.249.jpg

న్యూస్ లైన్ డెస్క్: సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూ క్యాంపస్ హాస్టల్ యాజమాన్యం పనితీరు ఇప్పటికీ మారలేదు. విద్యార్థులు తినే చెట్నీలో ఇటీవల ఎలుక స్విమ్మింగ్ చేసిన విషయం తెలిసిందే. ఉదయం టిఫిక్ కోసం తయారు చేసిన చెట్నీలో ఎలుక ఈత ఈత కొడుతూ కనిపించింది. విద్యార్థులు తినే ఆహారం పట్ల కనీస జాగ్రత్తలు పాటించరా అని ప్రశ్నించారు. 

మరోవైపు విద్యార్థులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోజనంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని, అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక ఈ విషయాన్ని మరువక ముందే, అదే హాస్టల్‌లో విద్యార్థుల ఆహారాన్ని పిల్లి తింటూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

తాజగా, ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు BRS సోషల్ మీడియా కన్వినర్ మన్నె క్రిశాంక్ కూడా స్పందించారు. జేఎన్టీయూ పిల్లులు, ఎలుకల పాలైందని ట్విట్టర్ వేదికగా ఫన్నీ పోస్ట్ పెట్టారు కేటీఆర్. ఇక, అధికారులు ఎలుకను పట్టుకోవడంలో అధికారులు విఫలం కావడంతో ఈ సారి పిల్లి జేఎన్టీయూ హాస్టల్‌కు వచ్చిందని మన్నె క్రిశాంక్ ట్వీట్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : india-people news-line newslinetelugu brs ktr jntu jntuhostel mannekrishank

Related Articles