Journalists: జంతర్ మంతర్ వద్ద జర్నలిస్ట్ ధర్నా

రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అరాచక పాలన నడుపుతున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే జర్నలిస్టులు శంకర్, చిలుక ప్రవీణ్, సరిత ఆవుల, విజయారెడ్డిలపై దాడులు జరిగాయని ఆయన గుర్తుచేశారు.
 


Published Aug 25, 2024 04:10:34 PM
postImages/2024-08-25/1724582434_asr.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలోని జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన జర్నలిస్ట్ ఆకుల శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అరాచక పాలన నడుపుతున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే జర్నలిస్టులు శంకర్, చిలుక ప్రవీణ్, సరిత ఆవుల, విజయారెడ్డిలపై దాడులు జరిగాయని ఆయన గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి సొంత ఊర్లో మహిళ జర్నలిస్టులకు రక్షణ లేదు ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే తెలంగాణాలో ఆటవిక రాజ్యం నడుస్తోందని అన్నారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థలోని కొంత మంది అధికారులు కండువా కప్పుకున్న కాంగ్రెస్ కార్యకర్తల కంటే దారుణంగా ఊడిగం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంత రావు చేసిన అక్రమాలను బయటపెట్టేందుకు ప్రయత్నించిన తనపై కూడా హత్యాయత్నం చేశారని ఆయన అన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపైనా దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులను ఆపకుంటే ఒక్కరు కాదు.. తెలంగాణలోని జర్నలిస్టులు అందరూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తారని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. 

తెలంగాణలో జర్నలిస్టులపై దాడిని ఆపకుంటే జంతర్ మంతర్ వద్దనే కాదు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తామని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 

newsline-whatsapp-channel
Tags : india-people newslinetelugu telanganam rahul-gandhi delhi journalist jantharmanthar journalist-saritha-avula journalist-vijaya-reddy journalist-akula-srinivas-reddy journalist-shankar

Related Articles