సినిమాల్లోనే కాదు..అత్యాచారాలు కిడ్నాప్ లు ఇలాగే జరుగుతాయని చెప్పిన ఇండస్ట్రీ మలయాళఇండస్ట్రీ. భావన తర్వాత చాలా యేళ్లుగా ఇండస్ట్రీ సైలెంట్ గానే ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎవ్వరిని అడిగినా చెప్తారు. దానికి లొసుగులు అవీ అవసరం లేదు. శ్రీరెడ్డి పుణ్యమా అని అన్ని ఇండస్ట్రీల విషయంలోను ఈ ఆరోపణలు నిజమేనని రుజువైంది. మలయాళం ఇండస్ట్రీ చాలా చిన్న ఇండస్ట్రీ ..కాని అందులో లొసుగులు మాత్రం బోలెడున్నాయి. ఒకప్పుడు దిలీప్ కుమార్ & భావన మధ్య జరిగిన ఇన్సిడెంట్ అన్ని ఇండస్ట్రీలను కుదిపేసింది. సినిమాల్లోనే కాదు..అత్యాచారాలు కిడ్నాప్ లు ఇలాగే జరుగుతాయని చెప్పిన ఇండస్ట్రీ మలయాళఇండస్ట్రీ. భావన తర్వాత చాలా యేళ్లుగా ఇండస్ట్రీ సైలెంట్ గానే ఉంది.
రీసెంట్ గా మరోసారి లైంగికవేధింపులు బయటపడ్డాయి.ఈ వేధింపులపై ఏర్పాటు చేసిన కమిటినే “హేమ కమిటీ”. ముగ్గురు సభ్యుల బృందం దాదాపుగా అన్ని సినిమాకి సంబంధించిన అన్ని శాఖలవారిని ఇన్వెస్టిగేట్ చేసి.. ఇండస్ట్రీలో అమ్మాయిలు/మహిళలు ఎదుర్కొనే సమస్యలపై 235 పేజీల రిపోర్ట్ ను నేను సబ్మిట్ చేసింది. 2017 వేసిన కమిటీ ఇప్పటికీ రిపోర్ట్ ను ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని ఇన్నాళ్లకు ఇన్నేళ్లు విషయాలు బయటపెట్టింది
మలయాళ ఇండస్ట్రీ లో ఆడవారు లైంగిక వేధింపులతో బాధపడితే...మగవాళ్లు ఇల్లీగల్ బ్యానింగ్ తో బాధపడుతున్నారు. మలయాళం ఇండస్ట్రీ అంతా దాదాపు 17 మంది దర్శక , నిర్మాతల చేతిలో ఉంది. వీరిదే పై చేయి. తమకు శారీరకంగా సహకరించని హీరోయిన్లను అలాగే.. తమను ఎదిరించే టెక్నీషియన్లను ఇల్లీగల్ గా బ్యాన్ చేస్తూ వారికి అవకాశాలు రాకుండా చేస్తూ.. వారే మలయాళం ఇండస్ట్రీ ని నడిపిస్తున్నారు.
ఇక మహిళలకు సెట్లో కనీస వసతులైన బాత్రూంలు ఉండవు...ఈ విషయం గుర్తు పెట్టుకోవల్సిందే ...తెలుగు ఇండస్ట్రీ లో కూడా లేవు. ఇలా చాలా సమస్యలు 235 పేజీల ఈ రిపోర్ట్ లో ఎవరి పేరు ప్రస్తావించలేదు. కాని సమస్యలను మాత్రం తెలిపారు. ఈ రిపోర్ట్ బయటకు రాగానే ...దాదాపు 100 మంది మహిళా ఆర్టిస్ట్ లు తమపై జరిగే .. ఆరోపణలు చెబుతూ బయటకు వచ్చారు. అయితే.. ఈ రిపోర్ట్ ను పబ్లిక్ చేయడానికి ముందు రిపోర్ట్ లోని దాదాపు 60కి పైగా పేజీలను డిలీట్ చేయించారని తెలుస్తోంది. అందులో మోహన్ లాల్ తీసిన దృశ్యం సినిమాలో పెద్ద కూతురు క్యారక్టర్ చేసిన అమ్మాయి ..తనను ఓ పెద్ద హీరో కమిట్మెంట్ అడిగారని ఆయన తనకు తండ్రి క్యారక్టర్ చేశారని చెప్పారు. దీంతో మలయాళం ఇండస్ట్రీ లో రబస మరింత ఎక్కువైపోయింది. అందుకే మోహన్ లాల్ తన అసోసియేషన్ పదవికి రాజీనామా చేశారని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.