వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన గోలను రవి అనే వ్యక్తి సీఐ తనను బట్టలు విప్పేసి కొట్టాడని.. రూ.2 లక్షలు ఇవ్వాలని టార్చర్ పెడుతున్నాడంటూ మీడియా ముందుకొచ్చాడు.
న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో పోలీసుల దాష్టీకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రక్షణగా నిలవాల్సిన పోలీసులే ప్రజల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. పలు కేసుల్లో పోలీసులే నిందితులుగా ఉన్న సందర్భాలూ న్నాయి. బాధితులను వేధిస్తూ.. యమ కింకరులుగా మారుతున్నారు. షాద్ నగర్ లో దళిత మహిళను వేధించిన ఘటన మరవక ముందే రాష్ట్రంలో మరో బాధితుడు గొంతు విప్పాడు.
వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన గోలను రవి అనే వ్యక్తి సీఐ తనను బట్టలు విప్పేసి కొట్టాడని.. రూ.2 లక్షలు ఇవ్వాలని టార్చర్ పెడుతున్నాడంటూ మీడియా ముందుకొచ్చాడు. బాధితుడు రవి చింతల్ లోని 444/ఏ అనే సర్వే నెంబరులో 237 గజాల స్థలం కొన్నాడు. ఈ విషయంలో భూమిని అమ్మిన వ్యక్తి సీఐ దగ్గరకు వెళ్లి రవి దగ్గర మరిన్ని డబ్బులు లాగాలని ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలో సీఐ డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని బాధితుడు తెలిపాడు. రెండు చేతులు కట్టేసి బట్టలు విప్పి కొట్టాడంటూ ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు.