KTR: తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో వెకిలి పనులా..?

చిహ్నంలో కాక‌తీయ కళా‌తో‌రణం, చార్మినార్‌ లేని రాజ‌ము‌ద్రతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు. 


Published Aug 27, 2024 11:23:43 AM
postImages/2024-08-27/1724738023_lrshelpdesk.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్‌లతో ఈ వెకిలి పనులు ఏంటి అని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ వరం‌గల్‌ కార్పొ‌రే‌షన్‌ ప్రధాన కార్యా‌లయం ఎదుట అధి‌కా‌రులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఆయన స్పందించారు. చిహ్నంలో కాక‌తీయ కళా‌తో‌రణం, చార్మినార్‌ లేని రాజ‌ము‌ద్రతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు. 

తెలంగాణ సీఎస్ శాంతి కుమారి దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు ఏం జరుగుతోందో కనీసం శాంతి కుమారికైనా తెలుసా అని ఆయన ప్రశ్నించారు. ఈ కొత్త చిహ్నాన్ని ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? అని కేటీఆర్ నిలదీశారు. ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు?  అని ప్రశ్నించారు. దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu brs tspolitics ktr telanganam politics telangana-government

Related Articles