హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని అన్నారు. అన్ని అసెంబ్లీలకు ఈ తీర్పు ప్రామాణికం కానుందని వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని BRS నేత, ఖుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు.
ఈరోజు హైకోర్టు ఇచిన తీర్పు BRS సాధించిన తొలి విజయమని ఆయన అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని అన్నారు. అన్ని అసెంబ్లీలకు ఈ తీర్పు ప్రామాణికం కానుందని వెల్లడించారు. మరోసారి కోర్టు జోక్యం చేసుకోకముందే అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని.. సీఎం ఆయనపై ఏ ఒత్తిడి తేవొద్దని అన్నారు.
కాంగ్రెస్ ఫిరాయింపులపై ద్వంద్వ ప్రమాణాలు వీడాలని ఆయన అన్నారు. అసెంబ్లీ గౌరవాన్ని స్పీకర్ కాపాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని వివేకానంద్ కోరారు. సీఎం రేవంత్ తీరుతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు తిరిగి వెళ్ళిపోతున్నాయని వివేకానంద్ గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశంపై శ్రద్ధ వహించి జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించారు.