Balkampet ellamma: అమ్మవారికి 27 చీరలు

కల్యాణ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని 27 చీరలు, స్వామి వారికి 11 పంచెలతో అలంకరించారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
 


Published Jul 09, 2024 04:04:08 AM
postImages/2024-07-09/1720515826_modi61.jpg

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను అమ్మవారికి మంత్రి కొండా సురేఖ సమర్పించారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని 27 చీరలు, స్వామి వారికి 11 పంచెలతో అలంకరించారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

బల్కంపేట ఎల్లమ్మను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. దేశంలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యాలు లేకుండా చూడాలని, పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. కేంద్రం తరపున ఆలయ అభివృద్ధికి నాలుగున్నర కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు కిషన్‌రెడ్డి. త్వరలో ఆ నిధులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతానని చెప్పారు.  

newsline-whatsapp-channel
Tags : newslinetelugu telanganam bonalu aashaadham balkampet balkampet-ellamma balkampettemple

Related Articles