Padi Koushik Reddy: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌశిక్ రెడ్డి

ఇంత పెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రభుత్వం స్పందించలేదని కనీసం  మంత్రి కూడా ఇటువైపు తొంగి చూడకపోవడం సిగ్గుచేటు అన్నారు. చిరు వ్యాపారులపై ప్రభుత్వానికి ఇంత చిన్నచూపు ఎందుకని అసలు ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ఆయన ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ప్రభుత్వ అధికారుల అందరితో వచ్చి ప్రమాదం జరిగిన తీరుతోపాటు ఆస్తి నష్టాన్ని అంచనా వేయాలని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం సాయం ఎందుకు అందించడం లేదు చెప్పాలని అన్నారు. 


Published Jul 22, 2024 06:20:58 AM
postImages/2024-07-22/1721644038_modi20240722T155238.695.jpg

న్యూస్ లైన్ డెస్క్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నడిబొడ్డున ఉన్న చిరు వ్యాపారుల షాపులు అగ్ని ప్రమాదంలో 31 షాపులు దగ్ధమై రోజులు గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, యాక్షన్ డ్రామాలు ఆపి వారికి నష్టపరిహారాన్ని అందించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. 

సోమవారం హుజురాబాద్‌లోని పాపారావు బొంద వద్ద చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నడిబొడ్డున షార్ట్ సర్క్యూట్ జరిగి 30 షాపులకు అగ్నిప్రమాదంలో చిరు వ్యాపారుల షాపులు దగ్ధం కావడం బాధాకరమన్నారు. చిరు వ్యాపారుల జీవనాధారమైన షాపులు దగ్ధమైన విషయం తెలిసి గుండె బరువు ఎక్కిందని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు వచ్చి వారికి ఏదైతే మాట ఇచ్చాను దాని ప్రకారమే తన జీవితంలో నుంచి ఒక్కో షాపుకు పదివేల చొప్పున రూ.3 లక్షల పదివేల ఇచ్చానని, పునర్నిర్మాణం కోసం కూడా లక్ష రూపాయలు అందించానన్నారు. వ్యాపారుల కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. 

ఇంత పెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రభుత్వం స్పందించలేదని కనీసం  మంత్రి కూడా ఇటువైపు తొంగి చూడకపోవడం సిగ్గుచేటు అన్నారు. చిరు వ్యాపారులపై ప్రభుత్వానికి ఇంత చిన్నచూపు ఎందుకని అసలు ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ఆయన ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ప్రభుత్వ అధికారుల అందరితో వచ్చి ప్రమాదం జరిగిన తీరుతోపాటు ఆస్తి నష్టాన్ని అంచనా వేయాలని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం సాయం ఎందుకు అందించడం లేదు చెప్పాలని అన్నారు. 

అగ్ని ప్రమాదంలో దగ్ధమైన షాపులు అన్నిటికీ ప్రభుత్వం లక్ష రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల నష్టపరిహారంపై ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ సెషన్ వారికి ఆగుతానని అప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు ఇచ్చి వారికి సాయం అందించకపోతే తర్వాత ప్రభుత్వంపై  తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. 

అలాగే గత మూడు రోజులుగా హుజురాబాద్ నియోజకవర్గం లో ఏడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో నియోజకవర్గంలోని వీణవంక మండలం మామిడాలపల్లి ఆమ్లెట్ గ్రామమైన గొల్లపల్లిలోని బ్రిడ్జ్ పూర్తిగా పాడైపోయిందని, దీంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయని వెంటనే దాన్ని మరమ్మత్తులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు ప్రతాప తీర్మాల్ రెడ్డి, కేశిరెడ్డి లావణ్య, నరసింహారెడ్డి, మొలుగు సృజన పూర్ణచందర్, రమాదేవి, అపరాధ ముత్యం రాజు, ప్రతాప మంజూల కృష్ణ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

newsline-whatsapp-channel
Tags : india-people ts-news newslinetelugu fire-accident telanganam karimnagar paadi-koushik-reddy

Related Articles