బెయిల్ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కవితకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రూ.100 కోట్ల ముడుపులు అందాయన్నది ఆరోపణలు మాత్రమే అని కోర్టు కామెంట్ చేసింది. ఒకవేళ కవిత సౌత్ గ్రూప్ కి రూ.100 కోట్ల ముడుపులు ముడితే ఎందుకు రికవరీ చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Breaking: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కవితకు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 164 రోజులుగా జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరైంది. గంటన్నర పాటు సాగిన విచారణలో సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ చేశారన్న ఆరోపణలతో మార్చి 15న ఈడీ కవితను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచితీహార్ జైల్లో ఉన్న కవిత పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. కాగా.. బెయిల్ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈరోజు జరిగిన తుది విచారణలో కవితకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రూ.100 కోట్ల ముడుపులు అందాయన్నది ఆరోపణలు మాత్రమే అని కోర్టు కామెంట్ చేసింది. ఒకవేళ కవిత సౌత్ గ్రూప్‌కి రూ.100 కోట్ల ముడుపులు ముడితే ఎందుకు రికవరీ చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కవిత కేసు విషయంలో ఈడీ చేసినవన్నీ ఆరోపణలే అని.. ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ఈడీకి మొట్టికాయలు వేసింది.
కవిత ఫోన్లు మార్చారని.. సాక్ష్యాలు తారుమారు చేశారని ఈడీ అధికారులు, ఈడీ తరపు న్యాయవాదులు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు గరం అయింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. ఇకపై కవిత కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. మరోవైపు కవితకు బెయిల్ రావడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కవిత బెయిల్ విచారణ కోసం వెళ్లిన కేటీఆర్, హరీష్ రావుతోపాటు వెళ్లిన BRS ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కవితకు భారీ ఎత్తున స్వాగతం పలకనున్నారు.