ప్రతిపక్షనేతగా మొదటిసారి ఈ రోజు జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన సభలో వెల్దంతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
న్యూస్ లైన్ డెస్క్: మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ గురువారం అసెంబ్లీకి వెళ్లారు. గతకొంత కాలంగా సమావేశాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరుకాని విషయం తెలిసిందే. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలకు ఆయన గైర్హాజరయ్యారు. ఆ సమయంలో శస్త్రచికిత్స కారణంగా ఆయన హాజరుకాలేక పోయారు. అప్పటి నుండి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, ప్రతిపక్షనేతగా మొదటిసారి ఈ రోజు జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన సభలో వెళ్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వెళ్లారు. ఇక లోక్ సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆయన తొలిసారిగా ప్రతిపక్ష నేత హూదాలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లారు. ప్రతిపక్ష నేతగా మొదటి సారి ఆయన అసెంబ్లీలో మాట్లాడనున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే అసెంబ్లీలో మాట్లాడేందుకు కేసీఆర్ పూర్తి స్థాయిలో సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం అసెంబ్లీకి వెళ్లిన సమయంలో BRS ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.