'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా 'తిమిరంతో సమరం' చేస్తూ.. నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి అని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ సాధనకోసం తాను సాగించిన పోరాట పంథాలో దాశరథి అందించిన స్పూర్తి ఇమిడి ఉందని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాశరథి అందించి స్పూర్తిని స్మరించుకున్నారు. కవిత్వం ద్వారా దాశరథి తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటారని తెలిపారు. దాశరథి కవిత్వం, సాహిత్యం ముందు తరాలకు నిత్య స్ఫూర్తిదాయకమన్నారు.