జస్టిస్ నర్సింహా రెడ్డి విచారణలో ఏమాత్రం పారదర్శకత చూపించలేదని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా విచారణ జరిపించాలని నరసింహా రెడ్డి కమిషన్ ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని లేఖ రాశారు. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన విషయం అందరికీ తెలుసని వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ను సవాల్ చేస్తూ మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. BRS అధికారంలో ఉన్న సమయంలో కరెంట్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విచారణ జరిపించేందుకు ప్రత్యేక విచారణ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌కు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. ఈ మేరకే విచారణకు హాజరుకావాలని కోరుతూ కేసీఆర్‌కు నోటీసులు కూడా పంపించారు.
అయితే, జస్టిస్ నర్సింహా రెడ్డి విచారణలో ఏమాత్రం పారదర్శకత చూపించలేదని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా విచారణ జరిపించాలని నరసింహా రెడ్డి కమిషన్ ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని లేఖ రాశారు. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన విషయం అందరికీ తెలుసని వెల్లడించారు.
అయితే, జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇటీవల కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు. విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగాలను ప్రతివాదులుగా చేర్చారు. అయితే, కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు రిజెక్ట్ చేసింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని కేసీఆర్.. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952, విద్యుత్తు చట్టం-2003కి విచారణ కమిషన్ విరుద్ధమని తెలిపారు. దాన్ని రద్దుచేయాలని సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.