జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్ 25న బెయిల్‌పై స్టే విధిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలోనే సీబీఐ వేసిన కేసులో కూడా ఆయన అరెస్ట్ అయ్యారు. ఇక జూన్ 27 నుండి ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. కాగా, ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయనను ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ రావడంతో.. జైలు నుంచి విడుదలయ్యారు. ఆ గడువు ముగిసిన తరువాత జూన్ 2న తిరిగి లొంగిపోయారు.
అనంతరం జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్ 25న బెయిల్‌పై స్టే విధిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలోనే సీబీఐ వేసిన కేసులో కూడా ఆయన అరెస్ట్ అయ్యారు. ఇక జూన్ 27 నుండి ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ తరఫు లాయర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, ఈడీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ లో ఆయనకు బెయిల్ లభించింది. కానీ, సీబీఐ వేసిన కేసులో కేజ్రీవాల్‌కు ఇంకా బెయిల్ రాలేదు. దీంతో ఆయన మరికొంత కాలం జైల్లోనే ఉండాలని అధికారులు తెలిపారు.