అబిడ్స్ పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుమూల్ స్వగ్రామంలో కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు. నిందితుడిని బిలాల్‌గా గుర్తించినట్లు తెలిపారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
న్యూస్ లైన్ డెస్క్: చిన్నారిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు 24 గంటలు కూడా గడవక ముందే పట్టుకున్నారు. హైదరాబాద్ కట్టెలమండిలో ప్రగతి అనే ఆరేళ్ల చిన్నారిని దుండగుడు కిడ్నాప్ చేశాడు. శనివారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన చిన్నారిని కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకొని వెళ్లాడు. చిన్నారి కనిపించకపోవడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ టీవీ కెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు రికార్డు అయినట్లు తెలుస్తోంది. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసి.. ఐదు బృందాలుగా బాలిక కోసం గాలించారు. ఆదివారం ఉదయం కిడ్నాప్‌ను పోలీసులు చేధించారు. ఆగంతకుడు బాలికను ఆటోలో ఎక్కించుకొని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అబిడ్స్ పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుమూల్ స్వగ్రామంలో కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు. నిందితుడిని బిలాల్‌గా గుర్తించినట్లు తెలిపారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
చిన్నారికి సైకిల్ కొనిస్తానని చెప్పి తీసుకొని వెళ్లినట్లుగా విచారణలో తేలింది. బాలిక దగ్గర నుంచి ఆమె తండ్రి ఫోన్ నెంబర్ తీసున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఆటోలో ఎక్కించుకుని ఆ తర్వాత బస్సులో నగర శివారు ప్రాంతానికి చిన్నారిని తీసుకొని వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీని ఆధారంగా కిడ్నాపర్ ను ఫాలో చేసిన పోలీసులు.. అర్ధరాత్రే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలికపై అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.