హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, GHMC కమిషనర్ ఆమ్రపాలి; బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్, బాల్మూర్ వెంకట్ సహా పలువురు కీలక నేతలు ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢ బోనాల మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, GHMC కమిషనర్ ఆమ్రపాలి; బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్, బాల్మూర్ వెంకట్ సహా పలువురు కీలక నేతలు ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఉదయమే అక్కడికి వెళ్లిన కిషన్ రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న తరువాత మీడియా పాయింట్ వద్ద కిషన్ రెడ్డి ప్రసంగించారు. మన దేశంలో వందల సంవత్సరాల నుండి బోనాల పండుగ సంప్రదాయం ఉందని ఆయన తెలిపారు. ఈ పండుగ మన తెలంగాణలోనే ప్రత్యేకమని అన్నారు. అందులో సికింద్రాబాద్‌లో జరిగే బోనాలు మరింత ప్రత్యేకమని అన్నారు. అయితే, కిషన్ రెడ్డి మాట్లాడుతుండగానే.. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయి వచ్చింది. దీంతో కిషన్ రెడ్డి తన స్పీచ్‌ను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.