భారత సినిమా చరిత్రలో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. ప్రపంచ భాషల్లో భారీ విజయాన్ని సాధించడమే కాదు.. వెయ్యి కోట్ల కలెక్షన్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
న్యూస్ లైన్ డెస్క్ సినిమా : భారత సినిమా చరిత్రలో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. ప్రపంచ భాషల్లో భారీ విజయాన్ని సాధించడమే కాదు.. వెయ్యి కోట్ల కలెక్షన్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ల పేర్లు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాయి. కోట్లాది గుండెలను మెప్పించిన ఈ సినిమాపై టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు సంచలన కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు ఇప్పుడు సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వెండితెరపై తన నటనతో కోటా శ్రీనివాసరావుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్నో పాత్రల్లో ఆయన ప్రేక్షకులను మెప్పించారు. విలన్ గా భయపెట్టి.. కమెడియన్ గా నవ్వించారు కూడా. బాబుమోహన్, కోటా శ్రీనివాసరావుల కాంబోలో వచ్చిన కామెడీ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న ఆయన వయసు మీద పడటంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తరుణంలో ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో బాహుబలి మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆయనను విమర్శించే వారికి ఒక అవకాశంగా మారాయి.
ఇంటర్వ్యూలో భాగంగా తెలుగు సినిమా వైభవం గురించి మాట్లాడిన కోటా శ్రీనివాసరావు బహుబలి గురించి కామెట్లు చేశారు. సినిమా విడుదలైనప్పుడు దాని గురించి అందరూ మాట్లాడారు. రికార్డులు, రివార్డులు.. అవార్డులు అందుకుంది. అందరూ బాహుబలి ఆహా.. ఓహో అన్నారు. కానీ.. ఇప్పుడు ఆ సినిమా గురించి ఒక్కరైనా మాట్లాడుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు కోటా. అప్పుడెప్పుడో వచ్చిన పాతాళ భైరవి సినిమా ముందు బాహుబలి సినిమా చాలా తక్కువే అన్నారాయన. ఆ సినిమాను నేటి తరం దర్శకులు తీయలేరు. ఒకరకంగా చెప్పాలంటే పాతాళ భైరవి ముందు బాహుబలి అంత గొప్ప సినిమా ఏం కాదు అన్నారు కోటా శ్రీనివాస రావు. నేటి తరం హీరోల్లో ఎన్టీఆర్ ని మించిన నటుడు లేడని.. డ్యాన్స్, నటన, డైలాగ్స్ అన్నీ పీక్స్ లో ఉన్నాయని ప్రశంసల వర్షం కురిపించారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటు ప్రభాస్, అటు రాజమౌళి, ఇతర హీరోల అభిమానులు కోటా శ్రీనివాసరావు మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఒక సినిమా గొప్పదనాన్ని చెప్పడంలో తప్పు లేదు. కానీ.. మరో సినిమాను తక్కువ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు సినీ అభిమానులు.