KTR: SRDP ప్రాజెక్టు పనులను సర్కార్ మూలాన పడేసింది

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను పూర్తిగా పట్టించుకోవడం మానేసిందని కేటీఆర్ విమర్శించారు. ప్రాజెక్టు పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. గత 8 నెలలుగా సరైన పర్యవేక్షణ లేదని.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. 


Published Aug 27, 2024 11:26:32 AM
postImages/2024-08-27/1724738192_ktr2.webp

న్యూస్ లైన్ డెస్క్: స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (SRDP) ప్రాజెక్టు పనులను సర్కార్ మూలాన పడేసిందని మాజీ మంత్రి, BRS వక్రింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గత BRS ప్రభుతం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన ట్వీట్ చేశారు. దీని కింద 42 కొత్త ప్రాజెక్టులను పూర్తిచేయాలని అనుకున్నామని ఆయన తెలిపారు. అయితే, ఇందులో 36 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశామని.. మిగిలిన ప్రాజెక్టులను కూడా 2024లో పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను పూర్తిగా పట్టించుకోవడం మానేసిందని కేటీఆర్ విమర్శించారు. ప్రాజెక్టు పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. గత 8 నెలలుగా సరైన పర్యవేక్షణ లేదని.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా SRDP మూడో దశను ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

మూడో దశకు సంబంధించిన ప్రణాళికలకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందని కేటీఆర్ తెలిపారు. మూడో దశలో కీలకమైన మూసీకి ఇరు వైపుల ఎక్స్‌ప్రెస్ వే, KBR పార్క్ వద్ద టన్నెల్స్, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లు వంటి పనులు ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచడంలో తోడ్పడటంతో పాటు నగరాభివృద్ధికి దోహదపడే ఈ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu brs ktr telanganam congress-government

Related Articles