కర్ణాటకలో అమలు చేసినట్లుగానే తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. ఇక్కడ కూడా ఆర్టీసీ నష్టాల్లోనే కొనసాగుతోందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక రాష్ట్రాన్ని అనుసరిస్తూనే తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. కర్ణాటకలో లాగానే తెలంగాణ ఆర్టీసీకి కూడా నష్టం వాటిల్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ కూడా ఆర్టీసీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: కర్ణాటకలో ఫ్రీ బస్సు పథకం వల్ల కేఎస్ఆర్టీసీకి రూ.295 కోట్ల నష్టం వాటిల్లినట్లు అక్కడి మీడియా తెలిపింది. దీంతో ఆ నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం సకలవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ పూర్తిగా నష్టపోకుండా ఉండేందుకు టికెట్ రేట్లు 15 నుండి 20 శాతం పెంచే ఆలోచనలో కేఎస్ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కర్ణాటకలో అమలు చేసినట్లుగానే తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. ఇక్కడ కూడా ఆర్టీసీ నష్టాల్లోనే కొనసాగుతోందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక రాష్ట్రాన్ని అనుసరిస్తూనే తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. కర్ణాటకలో లాగానే తెలంగాణ ఆర్టీసీకి కూడా నష్టం వాటిల్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ కూడా ఆర్టీసీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజగా, ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. బస్సు టికెట్ల ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు దూరంలో లేదంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇది ఫ్రీ అని ఎవరైనా చెప్తే, వాళ్లు కేవలం ఒక రైడ్‌కి మాత్రమే తీసుకెళ్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు. ఫ్రీ అని చెప్పిన దేనికైనా భారీ ధర ఉంటుందని తెలిపారు. ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ కూడా కర్ణాటక బాటలో నడుస్తూ టికెట్ల ఛార్జీలను పెంచే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు.