పోలీస్ శాఖ వాడాల్సిన భాష ఇదేనా అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ హెచ్చరించారు. సామాన్యు ప్రజల పట్లపోల్ పోలీసులు అమర్యాదగా వ్యవహరిస్తున్న ఘటనలు ఇప్పటికే ఎన్నో తన దృష్టికి వచ్చాయని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ పొలిసు శాఖ స్పందించకపోవడం సరికాదని కేటీఆర్ తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీడ్రైవర్‌పైన ట్రాఫిక్ పోలీస్ చేయిచేసుకొని దుర్భాషలాడారు. తల్లి, పెళ్ళాం అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్ల దండకం అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్లి పోలీసింగ్ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. తాజగా ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు.
పోలీస్ శాఖ వాడాల్సిన భాష ఇదేనా అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ హెచ్చరించారు. సామాన్యు ప్రజల పట్లపోల్ పోలీసులు అమర్యాదగా వ్యవహరిస్తున్న ఘటనలు ఇప్పటికే ఎన్నో తన దృష్టికి వచ్చాయని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ పొలిసు శాఖ స్పందించకపోవడం సరికాదని కేటీఆర్ తెలిపారు.
ప్రజలతో నేరుగా తమ విధులను నిర్వర్తించే పోలీస్ సిబ్బంది జాగ్రత్తగా నడుచుకోవాలని కేటీఆర్ వెల్లడించారు. ప్రజలతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచించారు.