సభలో ప్రధాన ప్రతిపక్షం తరపున కేటీఆర్ పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సభలో మాట్లాడుతున్నక్రమంలో కేటీఆర్ రేవంత్ రెడ్డితో ఉన్న స్నేహం గురించి ప్రస్తావించారు.
న్యూస్ లైన్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు కూడా కొనసాగాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభా సమావేశం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. వాడివేడిగా సాగిన సభలో ప్రధాన ప్రతిపక్షం తరపున కేటీఆర్ పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సభలో మాట్లాడుతున్నక్రమంలో కేటీఆర్ రేవంత్ రెడ్డితో ఉన్న స్నేహం గురించి ప్రస్తావించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 18 సంవత్సరాలుగా తనకు మంచి మిత్రుడని.. గత పదేళ్ల నుంచి ఇద్దరి మధ్య సత్సంబంధాలు దెబ్బ తిన్నాయని కేటీఆర్ అననారు. చిన్న వయసులోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని.. రేవంత్ చాలా లక్కీ ఫెలో అంటూ కేటీఆర్ అసెంబ్లీలో వ్యాఖ్యనించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి చెప్దామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని.. అసలు డెవలప్ మెంట్ గురించి చెప్పనివ్వడం లేదని కేటీఆర్ సెటైర్ వేశారు.