Power cuts: కరెంటు సమస్యలు పరిష్కరించడం డిస్కమ్‌లకు చేత కావడం లేదు..!

అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. చేసేదేమీ లేక ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కాల్సి వచ్చిందని యువకులు వెల్లడించారు. ఇక ఈ విషయం బయటకు రావడంతో కేటీఆర్ కూడా స్పందించారు. 


Published Aug 21, 2024 01:00:12 PM
postImages/2024-08-21/1724225412_KTRonpowercuts.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలోని కరెంటు కోతల సమస్యలను పరిష్కరించడం ఎనర్జీ డిపార్ట్‌మెంట్, డిస్కమ్‌లకు చేతకావడం లేదని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దాదాపు  ఏడు గంటల పాటు కరెంటు పోయినా.. అధికారులు పట్టించుకోక పోవడంతో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని కోటగడ్డ గ్రామానికి చెందిన యువకులు ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి మరమ్మత్తులు చేశారు. 

అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. చేసేదేమీ లేక ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కాల్సి వచ్చిందని యువకులు వెల్లడించారు. ఇక ఈ విషయం బయటకు రావడంతో కేటీఆర్ కూడా స్పందించారు. ఏడు గంటలు కరెంటు పోయినా.. సంబంధిత అధికారులు స్పందించక పోవడంతో విసిగిపోయిన బయ్యారంలో స్థానిక యువకుడు స్తంభం ఎక్కి విద్యుత్‌ను పునరుద్ధరించవలసి వచ్చిందని ఆయా ట్వీట్ చేశారు.

 ఇది చాలా ప్రమాదకరమైనది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారికి వేరే మార్గం లేదని తెలిపారు. కానీ, ఇటువంటి పరిస్థితి రాకూడని తెలిపారు. ఆ యువకుడి ధైర్యానికి మెచ్చుకోవాలని ఆయన వెల్లడించారు. ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలో ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌, డిస్కమ్‌లకు తెలియడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

newsline-whatsapp-channel
Tags : india-people ap-news brs congress ktr telanganam power-cuts currentofficers

Related Articles