మొత్తం రూ.41 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. కానీ, చివరికి రూ.17 వేల కోట్ల రుణమాఫీతో రైతులను కాంగ్రెస్ నట్టేట ముంచిందని కేటీఆర్ ఆరోపించారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రుణమాఫీ పేరుతోరాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరఫున ఈ లేఖ రాసినట్లు కేటీఆర్ తెలిపారు.
తెలంగాణలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకి రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు.. కానీ ఈ ప్రభుత్వం అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. మొత్తం రూ.41 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. కానీ, చివరికి రూ.17 వేల కోట్ల రుణమాఫీతో రైతులను కాంగ్రెస్ నట్టేట ముంచిందని కేటీఆర్ ఆరోపించారు.
లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలను చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే.. ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పైన పోరాడుతామని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేని కేటీఆర్ హెచ్చరించారు.