దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. మార్ఫింగ్ వీడియోపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి సీతక్క వీడియో మార్ఫింగ్, ట్రోలింగ్ అంశంపై చర్చ జరిగింది. సభలో జరిగిన వాటిని BRS ఎమ్మెల్యేలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఏదో ఓ వీడియో తీసుకుని ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గిరిజన మహిళా మంత్రి సీతక్క మీద కూడా అసభ్య కరంగా పోస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని.. పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. మార్ఫింగ్ వీడియోపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ అంశంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. బాధ్యులు ఎవరైనా ఉంటే చర్యలు తీసుకోండి అని ఆయన అన్నారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు నుంచి ఇప్పటి వరకు క్యారెక్టర్ దెబ్బ తినేలా ట్రోల్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సభలో కూడా గౌరవప్రదమైన మాటలు మాట్లాడేలా రూలింగ్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో వీడియోలు తీశారు అంటున్నారు.. మా వైపు నుండి అలాంటిది ఏమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
కెమెరాలు అన్ని స్పీకర్ ఆధీనంలోనే ఉంటాయని, కావాలంటే చెక్ చేయాలని అన్నారు. ఆ పొరపాటు ఎవరు ద్వారా జరిగిందో దర్యాప్తు చేయాలని అన్నారు. ఇక్కడున్న కెమెరాలు నడుపుతున్న ఏజెన్సీ వల్ల జరిగిందా చూసుకోవాలని అన్నారు. ప్రభుత్వం చట్టపరంగా ఏమైనా చర్య తీసుకోవాలన్న తీసుకోవచ్చు అని కేటీఆర్ అన్నారు.