మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా..? అని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న జీవో-33 విధానంపై ప్రభుత్వం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కేటీఆర్ తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: జీవో-33 అనే అంశంపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీర్వ దుమారం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ జీవో-33 విధానంలో కచ్చితంగా 9వ తరగతి నుండి ఇంటర్ వరకు తెలంగాణలోనే చదివి ఉండాలి. 10వ తరగతి వరకు ఇక్కడ చదివి ఇంటర్ వేరే రాష్ట్రంలో చదివితే ఇక్కడ మెడికల్ సీటుకు అర్హులు కారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జీవో-33పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా, ఈ అంశంపై మాజీ మంత్రి , brs వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా..? అని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న జీవో-33 విధానంపై ప్రభుత్వం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కేటీఆర్ తెలిపారు.
జీవో-33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయని ఆయన విమర్శించారు. 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు మన వద్ద చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారని గుర్తుచేశారు. కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారని వెల్లడించారు.
2023-24 విద్యాసంవత్సరం వరకు 6వ తరగతి నుంచి 12 తరగతి వరకు నాలుగేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించామని కేటీఆర్ తెలిపారు. దాని కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియేట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారు లోకల్ గానే పరిగణించబడే వారని వివరించారు.
ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారని.. దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని అయన హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.