వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డాక్టర్లు సమయానికి రావడం లేదని పేషేంట్లు వాపోతున్నారు. నెఫ్రాలజీ విభాగంలో పరీక్షలు చేయించుకునేందుకు దాదాపు 400 మంది ఔట్ పేషెంట్లు రావడంతో భారీ రద్దీ ఏర్పడింది. అయితే, సమయం 11 దాటినప్పటికీ డాక్టర్లు హాస్పిటల్‌కు రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడిక్యూ లైన్లలో నిలబడినప్పటికీ డాక్టర్లు రాలేదు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలోని పలు గవర్నమెంట్ హాస్పిటళ్లలో పేషేంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని హాస్పిటళ్లలో కరెంటు కోతలతో పేషేంట్లు ఇబ్బందులు పడ్డ సందర్బాలు ఇప్పటికే చాలా చూశాం. మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నీటి కొరతతో రోగులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. మరోవైపు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో కూడా ఫిర్యాదుల బాక్సు నిండిపోయినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఈ ఘటనలు మరువక ముందే ప్రభుత్వ హాస్పిటళ్లలో సిబ్బంది నిర్లక్ష్య వైఖరి మరోసారి బయటపడింది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డాక్టర్లు సమయానికి రావడం లేదని పేషేంట్లు వాపోతున్నారు. నెఫ్రాలజీ విభాగంలో పరీక్షలు చేయించుకునేందుకు దాదాపు 400 మంది ఔట్ పేషెంట్లు రావడంతో భారీ రద్దీ ఏర్పడింది. అయితే, సమయం 11 దాటినప్పటికీ డాక్టర్లు హాస్పిటల్‌కు రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడిక్యూ లైన్లలో నిలబడినప్పటికీ డాక్టర్లు రాలేదు. మరోవైపు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో కింద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.